- District News
- _రవీంద్రభారతిలో ఘనంగా గురువందనం.. వినాయక చవితి వేడుకలు
_రవీంద్రభారతిలో ఘనంగా గురువందనం.. వినాయక చవితి వేడుకలు
_శాస్త్రీయ నృత్య, సంగీత ప్రదర్శనలతో అలరించిన వంద మందికి పైగా కళాకారులు
కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 11 (లోకల్ గైడ్ ప్రతినిధి)
ఉపాధ్యాయ దినోత్సవం, రాబోయే వినాయక చవితి పర్వదినాలను పురస్కరించుకుని జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రధాన వేదికపై గురువందనం, శాస్త్రీయ నృత్య, సంగీత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంద మందికి పైగా కళాకారులు పాల్గొని వివిధ శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.పలువురు ప్రముఖ నృత్య, సంగీత గురువుల శిష్యులు ప్రత్యక్షంగా వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించగా, దూర ప్రాంతాలకు చెందిన మరికొందరు గురువులు సామాజిక మాధ్యమాల ద్వారా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. చండీ ప్రసన్న, కొండపల్లి నవ్య భారతి, రిధి బిల్లకంటి, కె. పూర్ణసాయి, లలిత జ్యోతిర్మయి, ఐశ్వర్య, జ్ఞానేశ్వరి, శ్రీకాంత్ గౌడ్, నిర్మలా విశ్వేశ్వరరావు, నాగశేఖర్, రవికుమార్ తదితర గురువుల శిష్యులు నృత్య, సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.కళాకారుల పాత్ర కీలకంఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదానికి ‘జై కళాకార్’ అనే పదాన్ని జోడించి సాంస్కృతికసంస్థనుఏర్పాటుచేయడంఅభినందనీయమన్నారు.దేశ రక్షణలో జవాన్లు, దేశ ప్రజలకు ఆహారం అందించడంలో రైతులు ఎంత ముఖ్యమో.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కళాకారులు కూడా అంతే కీలకమని ఆయన అన్నారు. భారతీయ పండుగలు, జాతీయ, సాంస్కృతిక సందర్భాలను పురస్కరించుకుని సంస్థ అధ్యక్షుడు రమణారావు కళా ప్రదర్శనలకు వేదిక కల్పిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.గురువులకు, కళాకారులకు సత్కారం
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రమణారావు శిష్యులతో కలిసి కళా ప్రదర్శనలు నిర్వహించిన గురువులు, కళాకారులను అభినందించారు. వారి సేవలకు గుర్తింపుగా ట్రెడిషనల్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అప్రిసియేషన్ సర్టిఫికెట్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా సీనియర్ నాట్య గురువు నిర్మలా విశ్వేశ్వరరావును ఘనంగా సత్కరించారు. వేదికపై సంఖ్యాశాస్త్రవేత్త దైవజ్ఞ శర్మతో పాటు పలువురు కళా, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు యువ కళాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. గురువులను గౌరవిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు రవీంద్రభారతిలో సందడి వాతావరణాన్ని నెలకొల్పాయి.
