- District News
- గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
లోకల్ గైడ్ సెప్టెంబర్ 11 మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా ప్రసిద్ధ పండుగ అయిన వినాయక చవితి పురస్కరించుకొని గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మహబూబాబాద్ లో వినాయక చవితి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో హాజరై కార్యక్రమానికి ప్రత్యేక శోభను తెచ్చారు. చిన్నారులు స్వయంగా మట్టితో తయారు చేసిన వివిధ ఆకారాలలోని అందమైన పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రదర్శించారు.
విద్యార్థులు బంగాళదుంప, క్యారెట్, బెండకాయ, వంకాయ వంటి వివిధ రకాల కూరగాయలతో వినూత్నంగా వినాయక విగ్రహాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అదేవిధంగా యాపిల్, అరటి, జామ, నారింజ వంటి వివిధ రకాల పండ్లతో పిల్లలు సృజనాత్మకంగా గణపతి రూపాలను రూపొందించి తమ కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ కొనకంచి రామకృష్ణ మరియు మమత హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ... "వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలి. ప్లాస్టిక్ కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని నివారించాలి. చాలా చోట్ల రసాయనాలతో కూడిన విగ్రహాలను వాడుతున్నారు, వాటిని నివారించి మట్టి గణపతిని మాత్రమే పూజించాలి. అప్పుడే ప్రకృతిని కాపాడగలం" అని పిల్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ నరసింహారావు వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక సర్కార్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు.
