పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

Published On
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.


 



నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.


 జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై తక్షణ స్పందన తదితర అంశాలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు లేకుండా దర్యాప్తులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును నిర్దేశితIMG-20260911-WA0210 కాలవ్యవధిలో సమగ్రంగా దర్యాప్తు చేసి, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించి నాణ్యమైన చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి, పరారీలో ఉన్న నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత కేసుల్లో నిందితుల కదలికలను పరిశీలిస్తూ, పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత బ్యాంకులు, సైబర్ క్రైమ్ విభాగాలతో సమన్వయం చేసుకుని మోసపోయిన నగదును వీలైనంత త్వరగా ఫ్రీజ్ చేయించాలని ఆదేశించారు.బాధితుల నగదు ఫ్రీజ్ అయిన అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, బాధితులకు నగదు తిరిగి అందేలా పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల్లో ప్రతి నిమిషం కీలకమని, బాధితుల ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. దొంగతనాలు, దోపిడీలు, చోరీలు తదితర ఆస్తి నేరాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన ఆస్తిని పూర్తిస్థాయిలో రికవరీ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్, రాత్రి గస్తీ, వాహనాల తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వాటి విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు ప్రజల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించి, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యలను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా చట్టపరమైన పరిధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీసుల పనితీరుపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. సమావేశంలో పెండింగ్ కేసులు,  ఎన్ బి డబ్ల్యు కేసులు, గ్రేవ్ కేసులు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు , చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు,  ఎన్డిపిఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, నేరస్థులపై నిఘా, బీట్ పెట్రోలింగ్, రాత్రి గస్తీ తదితర అంశాలపై కేసుల వారీగా సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి