- District News
- సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలకు ఇబ్బందులే
సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలకు ఇబ్బందులే
చర్లలో సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతి
Published On
By Ram Reddy
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. చర్ల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ నుంచి సాయిబాబా ప్రాంతం వరకు డ్రైనేజీ నిర్మించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 17:58:11
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి*
వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
