- District News
- _విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా సపావత్ మురళి సేవా కార్యక్రమాలు
_విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా సపావత్ మురళి సేవా కార్యక్రమాలు
_దేవరకొండ బాలుర గురుకుల పాఠశాలకు కుర్చీల స్పాన్సర్‌షిప్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఫౌండర్ అండ్ సీఈవో సపావత్ మురళి
దేవరకొండ: విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, వారికి మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో టెహ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ మిగ్రేషన్ కన్సల్టెన్సీ ఫౌండర్ అండ్ సీఈవో సపావత్ మురళి సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేవరకొండ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ బాలుర గురుకుల పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన కుర్చీలను స్పాన్సర్ చేశారు.
విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సరైన సౌకర్యాలు కల్పించడం కూడా ఎంతో ముఖ్యమని భావించిన సపావత్ మురళి.. గురుకుల పాఠశాలకు ఫర్నిచర్‌ను అందించి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లను శాలువాలతో సత్కరించి, విద్యార్థుల విద్యాభివృద్ధికి వారు అందిస్తున్న సేవలను సపావత్మురళిఅభినందించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించి వారి విద్య, భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్యపై ఆసక్తి తదితర అంశాలను తెలుసుకున్నారు.ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలిఈ సందర్భంగా సపావత్ మురళి మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి సరైన దిశలో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి విద్యా వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్నిపెంచేందుకుఅవకాశంఉంటుందన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మా సంస్థ తరఫున నిరంతరం మా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తాం. విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి తన కలను లక్ష్యంగా మార్చుకుని, దాన్ని సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి” అని సపావత్ మురళి అన్నారు.విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడంలోనూ టెహ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ కీలకంగా వ్యవహరిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ ఎంపిక, అడ్మిషన్ ప్రక్రియ, వీసా మార్గదర్శకత్వం, ఎడ్యుకేషనల్ లోన్ సహాయం తదితర అంశాల్లో అవసరమైన మార్గనిర్దేశం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు విద్యా రంగంలో మార్గదర్శకత్వం అందించడంతో పాటు, విద్యా సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా సామాజిక బాధ్యతను కూడా సంస్థ కొనసాగిస్తోందన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకత్వం.. సమాజ అభివృద్ధికి మా వంతు సహకారం” అనే లక్ష్యంతో సపావత్ మురళి నేతృత్వంలోని టెహ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్షన్ ముందుకు సాగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేవరకొండ గురుకుల పాఠశాలకు కుర్చీలను స్పాన్సర్ చేయడం విద్యార్థుల పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
