- District News
- సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...
సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లి లో ఉచిత యూనిఫాం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు )అయిన శ్రీ చిన్నం ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూదనపల్లి గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫామ్స్ వస్తాయి... అలాగే ఈ సంవత్సరం కూడా మొదటి విడతగా ఉచిత యూనిఫామ్ లు సూధనపల్లి పాఠశాలకు రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎండి .అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి.శుభ, కె. సారంగం, ఏ .ప్రగతి,ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రేఖ మాధవి, ఆయా నీలం వాసవి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలమశెట్టి ధనమ్మ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
