ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి

గుడిపూడి తిరుమల రావు డిమాండ్‌.. అభివృద్ధి పథంలో వైరా నియోజకవర్గం

Published On
ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : ప్రజలతో మమేకమై, పేదలు, గిరిజనులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేస్తున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు రాబోయే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కేటాయించాలని గేట్ కారేపల్లి కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఆర్‌ఐ గుడిపూడి తిరుమల రావు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాందాస్ నాయక్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని తిరుమల రావు తెలిపారు. రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు, కొత్త అభివృద్ధి పనులు తీసుకురావడంలో ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని అన్నారు.
ప్రజల మధ్య నిత్యం ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న నాయకుడిగా రాందాస్ నాయక్‌కు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉందని తిరుమల రావు పేర్కొన్నారు. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి లభిస్తే వైరా నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యం లభించి, అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అందువల్ల సింగరేణి మండల ప్రజల ఆకాంక్షను, వైరా నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాబోయే మంత్రివర్గ విస్తరణలో మాలోత్ రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని గుడిపూడి తిరుమల రావు మనస్ఫూర్తిగా కోరారు.

Tags:

About The Author

Latest News