కేంద్రీకృత వంటశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Published On
కేంద్రీకృత వంటశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

.


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో పాత వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్,మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్ సంస్థ)ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్(కేంద్రీకృత వంటశాల) నిర్మాణ పనులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆయన వెంట మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్,మేయర్ ధర్ని మధుకర్,మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు,కార్పొరేటర్ తూముల నరేష్,మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి,పలువురు కార్పొరేటర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News