- District News
- Nalgonda
- గ్రామాలలో రహదారులు తాగునీరు పారిశుద్ధం వీరు దీపాలు ఉంటే ప్రాథమిక వసతులు మరింత మెరుగుపరచాలి.
గ్రామాలలో రహదారులు తాగునీరు పారిశుద్ధం వీరు దీపాలు ఉంటే ప్రాథమిక వసతులు మరింత మెరుగుపరచాలి.
అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలతో నిన్నుత సమయంలో పూర్తి చేయాలి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.
నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి , సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేముల వీరేశం గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, సామర్థ్య వృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి ప్రాథమిక వసతులను మరింత మెరుగుపరచాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామానికి చేరవేసి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
