- District News
- Nalgonda
- ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రతి మండలంలో 4 రోజులు ఉచిత వైద్య శిబిరాలు .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్
నకిరేకల్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు కంటి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడంతో పాటు, ఆపరేషన్ అనంతరం ఉచిత కంటి అద్దాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో నాలుగు రోజుల పాటు ఇలాంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గత ఏడాది సుమారు 1,000 మందికి కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన కంటి చూపును అందించడమే లక్ష్యంగా ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలందరూ ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు , పుష్పగిరి ఆసుపత్రి డాక్టర్ రాజేష్ వారి బృదం, మండల పార్టీ అధ్యక్షులు గాదగోని కొండయ్య , టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న , ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
