విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులే.

రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

Published On
విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులే.

 


 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  .లోకల్ గైడ్.

               విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి  ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.ఉపాధ్యాయులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని,గత సంవత్సరములతో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా  విద్యార్థుల నమోదు శాతం   10 శాతం తగ్గగా, నల్గొండ జిల్లాలో మాత్రం 9% పెరిగిందని,ఇది జిల్లా ఉపాధ్యాయుల  పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నప్పటికీ చాలామంది విద్యార్థులు  ప్రైవేట్ కు వెళ్తున్నారని, ప్రైవేటు పాఠశాలల్లో బట్టి విధానం, ఇంగ్లీష్ మీడియం వంటివి ప్రభావం చూపిస్తున్నాయని,  ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు ప్రైవేట్ పట్ల మొగ్గు చూపడం  పై అందరు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ,తెలంగాణ పబ్లిక్ స్కూల్ ల ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండలో 200 కోట్ల రూపాయలతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం 12,000 మంది టీచర్ లను కొత్తగా నియమించిందని, అవసరమైతే మరికొంతమందిని నియమిస్తామని ,ఉపాధ్యాయులు పిల్లలకు విద్యను అందించడంతోపాటు, వారికి ఆరోగ్యం, జీవిత లక్ష్యాలు నేర్పించాలని మంత్రి సూచించారు. పదవ తరగతి తర్వాత ఇంటర్ విద్యలో ఎక్కువమంది ఫెయిల్ అవుతున్నారని దీనిపై దృష్టి సారించాలని, అలాగే మధ్యలోనే బడి మానేసేవారి వివరాలను సేకరించి అందుకు గల కారణాలను విశ్లేషించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఒకప్పుడు పుస్తకం ద్వారా మాత్రమే విద్యార్థులకు అన్ని అంశాలు బోధించే అవకాశం ఉండేదని, ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు,ఇంటర్నెట్ విద్యను అందించడంతోపాటు, విద్యార్థులు చెడిపోయేందుకు కూడా దోహదపడుతున్నాయ, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు సక్రమ మార్గంలో విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నతలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఎక్కువగా ఉందన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులలో వారి ప్రతిభ, పురోగతి, ఇతర అంశాలపై  ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.ఈ సంవత్సరం జిల్లాలో విద్యార్థుల  సంఖ్య 2000 పెరిగిందని ,విద్యాభివృద్ధిలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, ఆన్లైన్లో విద్యను అభ్యసించడం వంటివి చేస్తున్నామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ల ద్వారా మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని, సమాజంలో గురువుకు ఇచ్చిన స్థానాన్ని అర్థం చేసుకొని విద్యను అందించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు .రాష్ట్ర ముఖ్యమంత్రి నకిరేకల్ సందర్శన సందర్భంగా సెప్టెంబర్ 5 న  నిర్వహించవలసిన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు  ఆయన వివరించారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ విద్యార్థుల మార్కులు, రిజల్ట్స్ కాకుండా వారికి విలువలు ,గౌరవం నేర్పించాలని ,పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా చెడు మార్గాన పయనించకుండా టీచర్లు, తల్లిదండ్రులు నైతిక విలువలు పెంపొందించాలన్నారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ చదువుతో విద్యార్థుల జీవితాలు మారతాయని, చదువు విద్యార్థుల జీవితానికి వెలుగునిస్తుందని, ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పనిచేసి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.మరో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రాష్ట్రపతిగా సేవలు అందించి చివరి శ్వాస వరకు ఉపాధ్యాయుడుగా  కృషి చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయులు వారి వృత్తికి పునరంకితం కావాలన్నారు.నల్గొండ మున్సిపల్ మేయర్  బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గురువులకు గొప్ప స్థానం ఉందని, విద్యార్థులకు దిశా, నిర్దేశం చేసేది, విలువలు నేర్పేది, దేశ అభివృద్ధిని పెంపొందించడంలో గురువుల బాధ్యత ఎంతో  ఉందన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు సమర్పించిన తన నివేదికలో ఈ సంవత్సరం జిల్లాల్లో తొమ్మిది శాతం విద్యార్థులు నమోదు పెరిగిందని, జిల్లాలోని ఉపాధ్యాయులు పాఠశాల పని గంటలకు అదనంగా గంటన్నర పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్  అమీర్ అలీ,కార్పొరేటర్  గుమ్మల జానకి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి