విద్యతోనే ఉజ్వల భవిష్యత్.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి.

Published On
విద్యతోనే ఉజ్వల భవిష్యత్.

లోకల్ గైడ్/తాండూర్:
విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెల్‌కమ్ పార్టీ’కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం ఉందన్నారు. విద్యార్థులు కళాశాలలో లభిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
గతంలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కళాశాలకు పేరు తీసుకొచ్చారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు కూడా పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.
అదేవిధంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకొని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.