- District News
- Nalgonda
- ఈనెల 26న రత్న ఫంక్షన్ హాల్ లో ,తపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానo.
ఈనెల 26న రత్న ఫంక్షన్ హాల్ లో ,తపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానo.
Published On
By Ram Reddy
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 26వ తేదీన నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10:00 గంటలకి జిల్లా స్థాయిలో "గురువందన కార్యక్రమం" నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేణిగుంట్ల రాజశేఖర్ లు వెల్లడించారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.జ్ఞాన సంపదకు నిలయమైన గురువు గొప్పతనాన్ని,గురువు ఔన్నత్యాన్ని చాటడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గురువందనం కార్యక్రమంలో జిల్లాలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న గురువులను సంఘాలకు అతీతంగా ప్రభుత్వ /స్థానిక సంస్థల పాఠశాలలు,మోడల్ స్కూల్స్,రెసిడెన్షియల్ స్కూల్స్ , కేజీబీవీ పాఠశాలల నుండి ఆయా మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపల్స్, ఎస్ ఓ లు ,మండల బాధ్యుల ఉమ్మడి సలహాలు సూచనలతో ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుంది అన్నారు
ఇట్టి మహోన్నత కార్యక్రమంనకు ఉపాధ్యాయులుగా మనందరం హాజరై గురువులకు వందనాలు పలుకుదాము.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ.వి.యన్.రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.కావున ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 15:23:36
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా
