- District News
- సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టొద్దు.
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టొద్దు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట ఆగస్టు 23:
నారాయణపేట జిల్లా పరిధి లో సామాజిక మాధ్యమా ల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టు లు పెట్టేవారి పై చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటా మని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రానున్న పండగల నేప థ్యంలో కుల, మత, ప్రాంతీ యంగాను ప్రజల భద్రత కు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు.సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇత రులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియో లు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు. సామాజిక మధ్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే వాళ్లపైన ప్రత్యేకంగ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు..
జిల్లాలో ఈ తరహా కార్య కలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరి గింది. ఈ తరహా నేరలకు పాల్పడే వారిని వెంటనే పట్టుకొని అట్టి వారిపై కేసులు నమోదు చేయా లని పోలీసులకు సూచిం చారు. పోలీసులు నిరంత రం 24/7 పరిశీలిస్తుం టారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు.
ఫోటో రైట్ అప్:6.ఎస్పీ వినీత్
