పేట జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపిక

Published On
పేట జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపిక


నారాయణపేట ఆగస్టు 23:
నారాయణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యం లో జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపికలు ఆదివారం నారాయణపేట స్టేడియం గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహిం చడం జరిగింది.ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూల ల నుంచి సుమారు 500 మంది మహిళా క్రీడాకారి ణులు ఉత్సాహంగా హాజరై తమ ప్రతిభను ప్రదర్శిం చారు.ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేసి జిల్లా జట్లకు ప్రాతిని ధ్యం వహించే అవకాశం కల్పించనున్నారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ  చెన్నారం వెంకటప్ప  ఆధ్వర్యంలో నిర్వహించ డం జరిగింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320A మల్టిపుల్ కౌన్సిల్ మెంబర్ లయన్ డాక్టర్ హరి నారా యణ భట్టడ్  క్రీడాకారిణు లను పరిచయం చేసుకొని, వారితో మాట్లాడి, వారి భవిష్యత్ క్రీడా ప్రయాణా నికి ఆల్ ది బెస్ట్ తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రెడ్డి, రిటైర్డ్  పి ఇ టి  నరసింహులు, లయన్ బి. సాయినాథ్ ,పాస్ట్ సెక్రటరీ, వారియర్స్ డిఫెన్స్ అకాడ మీ డైరెక్టర్ లయన్ శాంత , లయన్ ఎస్. చక్రవర్తి , వ్యాయామ ఉపాధ్యా యులు  అనంతసేన, బాలరాజు, వేణు, శేఖర్ , భీమ్ రెడ్డి గారు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మహిళా క్రీడాకారి ణులకు కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్న నారాయణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు అభినందించారు.
ఫోటో రైట్ అప్:3.జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు
_____________________

Tags:

About The Author

Latest News