ప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి.

రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం.

Published On
ప్రీ ప్రైమరీ నియామకాలు వెంటనే చేపట్టాలి.

 

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు ఇన్స్ క్టర్, ఆయాలను నియమించడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యా బోధన ప్రారంభించింది. కానీ మన జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల నియామకం కు నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలు గడిచినప్పటికీ నేటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయకపోవడం వలన ఆయా పాఠశాలల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల విద్యాబోధన తీవ్రం గా ప్రభావితం అవుతుందని, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడి ఆ పాఠశాల విద్యార్థుల విద్యా బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అన్నారు. తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోయి తమ పిల్లల్ని తిరిగి ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్తున్నారని, దీని వలన తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడి ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ప్రక్రియ ఆగిపోయిందని అనడంలో అర్థం లేదని,  అధికారులు చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి మాట్లాడుతూ వెంటనే తగు చర్యలు తీసుకొని నల్లగొండ జిల్లాలో 124  ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోధనకు ఇన్స్ట్రక్టర్ ఆయాలను నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ చేపడుతుందని అన్నారు. నిరసన అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలలో మరియు కలెక్టర్ కార్యాలయంలో  వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, ఏ చిన్న వెంకన్న, కొమరాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సైదులు, రాగి రాకేష్, సి.హెచ్.రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య మరియు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు,  సెలక్షన్ లిస్ట్ లో మెరిట్ లో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,