బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.

మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి

మహిళా చైతన్యానికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
Published On
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.

లోకల్ గైడ్/తాండూర్:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి, బహుజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి కొనియాడారు.
గురువారం తాండూర్ పట్టణంలో రజక సంఘం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీరజ బాల్‌రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా రజకుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షులు రాజు,  కార్యదర్శి శాంతు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, రజక ఉపాధ్యాయ కమిటీ నేతలు మోహన్, సుధాకర్, నాగప్ప, తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిమ్మయిపల్లి శ్రీనివాస్, కోశాధికారి రాములు, ఆర్గనైజర్ చంద్రయ్య, నరేందర్, సంఘ నాయకులు అశోక్, రవి, పెంటప్ప,  బాలు, బస్వరాజ్ సీనియర్ నాయకులు సాయిలు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
        శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ): మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం. 
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి