భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..

Published On
భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..

 లోకల్ గైడ్ సెప్టెంబర్ 11 మహబూబాబాద్ 


మహబూబాబాద్ జిల్లా 
 కేసముద్రం మండలం గ్రామం కోరుకొండపల్లి 

 బాధిత కుటుంబాలకు అండగా ఉంటా...- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్
IMG-20260911-WA0114
ఇటీవల అకాల మరణం చెందిన పలువురి కుటుంబ సభ్యులను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ స్థానిక సర్పంచ్ యాసాడి బాలాజీ రెడ్డి మరియు మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు భాదిత కటుంబాలను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు..​

కోరుకొండపల్లి గ్రామ పరిధిలోని మెగ్యా తండాలో ఇటీవల మృతి చెందిన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య సతీష్ తండ్రి భూక్యా రామ్ కోటి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రామ్ కోటి కుమారులు భూక్య లక్ష్మణ్, భూక్య సతీష్, భూక్య విజేందర్లతో మాట్లాడి ఓదార్చారు.కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.​
అదేవిధంగా కోరుకొండపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వేం నరేందర్ రెడ్డి అనుచరులు మూల భూలోక్ రెడ్డి తమ్ముడు మూల ఆనంద్ రెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంద్ రెడ్డి కుమారుడు మూల రాజ వర్ధన్ రెడ్డి, సోదరుడు మూల భూలోక రెడ్డిలను పరామర్శించి,ఆనంద్ మరణం వారి కుటుంబానికి తీరని లోటని,వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

​ ఈ పరామర్శ కార్యక్రమంలో  గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్,బీరం గోపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగేల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్,వార్డు సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్ సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : మండలంలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల యూనిఫాంలు,
భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
"కోట్ల మణిపూసలు"
మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి
"శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల సమన్వయం - శాంతి భద్రతల పరిరక్షణ
సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...