- District News
- Ranga Reddy
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు
మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాజీ జడ్పీటీసీ తనయుడు ఎదిరే రామకృష్ణ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 12 కొందుర్గ్.
కొందుర్గ్ మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పలపల్లి నరసింహులు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న మండల బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపిపి శ్రీ రాజేష్ పటేల్ మాజీ జెడ్పిటిసి ఎదిరే రామకృష్ణ చెరుకుపల్లి నరసింహులు నివాసానికి వెళ్ళి వారి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం నరసింహులు గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనో ధైర్యం చెప్పారు. ఈ కష్టసమయంలో నరసింహులు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పవిత్రమైన మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తమ గాఢ సానుభూతిని వ్యక్తం చేశారు
.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చెరుకుపల్లి మాజీ సర్పంచ్ ప్రేమ్ కుమార్, గ్రామ అధ్యక్షులు నడిమింటి నరసింహులు, తుమ్మలపల్లి రామస్వామి, కుమ్మరి పవన్ , ప్రవీణ్ ఇప్పలపల్లి యాదగిరి , వడ్డె చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Aug 2026 15:43:05
లోకల్ గైడ్ న్యూస్ 12 కొందుర్గ్.
కొందుర్గ్ మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పలపల్లి నరసింహులు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం...
