- District News
- Khammam
- మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా ఓనం వేడుకలు
మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా ఓనం వేడుకలు
చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి: ప్రిన్సిపాల్ మినీ జోజో
కారేపల్లి మాంటిస్సోరి స్కూల్‌లో ఓనం పండుగ వేడుకలను మంగళవారం పాఠశాల ప్రిన్సిపాల్ మినీ జోజో, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓనం పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఓనం పండుగకు ప్రత్యేకమైన సంప్రదాయ వేషధారణలో హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తూ సందడి చేశారు. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మినీ జోజో మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ ప్రాంతాల పండుగలు, సంస్కృతులు, సంప్రదాయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా వారిలో సాంస్కృతిక విలువలను పెంపొందించవచ్చన్నారు. ఓనం పండుగ విశిష్టత, ప్రాధాన్యతను చిన్నారులకు వివరించారు. పండుగల ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం, ఐక్యత, ఆనందం పెంపొందుతాయని, ప్రతి పండుగ వెనుక ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
