ఖరీఫ్, రబీ 2025–26 సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేయాలి. 

సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకి డెలివరీ చేయడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి: అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి 

Published On
ఖరీఫ్, రబీ 2025–26 సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేయాలి. 

 

 

 రంగారెడ్డి జిల్లా బ్యూరో,  ( లోకల్ గైడ్):                         ఖరీఫ్,  రబీ (2025-26) సిఎంఆర్  డెలివరీలను సకాలంలో పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి సూచించారు. మంగళవారం అయన కస్టమ్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి ఖరీఫ్, రబీ 2025–26 సంవత్సరాలకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) డెలివరీల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్, రబీ 2025–26కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ డెలివరీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. ముఖ్యంగా రా సీఎంఆర్‌ను భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ )కు డెలివరీ చేయడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. మిల్లర్లు తమ వద్ద ఉన్న పెండింగ్ సీఎంఆర్‌ను వెంటనే డెలివరీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఆర్ డెలివరీలలో జాప్యం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి సి ఎస్ ఓ వనజాత,  డిఎంసిఎస్ హరీష్ సంబంధిత శాఖల అధికారులు, కస్టమ్ మిల్లర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి