- District News
- సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎంపీ మల్లు రవి
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎంపీ మల్లు రవి
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషికి అభినందనలు
లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 24:
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సోమవారం తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు.
విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలను ఆకర్షించే దిశగా ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఎంపీ మల్లు రవి అభినందించారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎంపీ మల్లు రవి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ మల్లు రవి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.
