డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన...

Published On
డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన...


నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 17: 
నిజామాబాద్​ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.
 బీజేవైఎం నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్​ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ వందేమాతర గీతాలాపన చేయలేదని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. వారికి వందేమాతర గీతం ఎలా పాడాలనేది నేర్పించేందుకు తాము కాంగ్రెస్​ కార్యాలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట వందేమాతరం గీతాలాపన చేశామన్నారు.  అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్​, కార్పొరేటర్లు కల్పె అర్చన చిరంజీవి, సుధీర్​, శశాంక్​, శ్రావణ్​ పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్