- District News
- Khammam
- రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
మేకలతండా నుంచి కాంగ్రెస్‌లోకి భూక్యా సాములు, భూక్యా సురేష్
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 11: కారేపల్లి మండలం మేకలతండా గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు భూక్యా సాములు, భూక్యా సురేష్ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని వారు హస్తం గూటికి చేరారు.
వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని ఈ సందర్భంగా వారు
తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్న తీరు పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాందాస్ నాయక్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి మండల సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బానోత్ రామూర్తి నాయక్, మేకలతండా నాయకులు భూక్యా కబీర్, భూక్యా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
