- District News
- Nizamabad
- నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్
నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్
Published On
By Ram Reddy
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా రాజా గౌడ్ బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా విధులు నిర్వహిస్తున్న రాజా గౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో బోధన్ ఆర్డీవోగా పనిచేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ప్రస్తుత బాధ్యతల్లో ఉపయోగపడుతుందని అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు.
రెవెన్యూ పరిపాలన, భూసంబంధిత అంశాలు, ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
