- District News
- Ranga Reddy
- ప్రైవేట్ స్కూల్ బస్సులను వివాహాలకు వినియోగించొద్దు
ప్రైవేట్ స్కూల్ బస్సులను వివాహాలకు వినియోగించొద్దు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆమనగల్లు, ఆగస్టు 18:
ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను వివాహ వేడుకలు, ఇతర వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ట్రస్మా (ట్రస్మ), ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల రవాణాకు ఉద్దేశించిన పాఠశాల బస్సులను అదే అవసరాలకు పరిమితం చేయడంతో పాటు, స్థానిక టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం అందజేసిన వారిలో కల్వకుర్తి తాలూకా ఇన్‌చార్జ్ ఎడ్ల శ్రీశైలం, వర్త్యావత్ పాండు, ఇస్లావత్ రమేష్, నేనావత్ హనుమంతు, కొమ్ముగోని శీను, డేరంగుల మహేష్, ధర్మేందర్, వెంకటేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
