- District News
- Nizamabad
- సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి.
సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి.
అదనపు కలెక్టర్ భుజంగరావు
ఘనంగా జయంతి వేడుకలు
Published On
By Ram Reddy
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 :
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
