తీజ్ పండుగ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

Published On
తీజ్ పండుగ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగస్టు 10: 
నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని వివిధ తాండాలలో ఆషాఢ మాసంలో బంజారా సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా కొనసాగి విజయవంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జిల్లా తీజ్ కమిటీ బాధ్యులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, తీజ్ పండుగను అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా తీజ్ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తీజ్ ఉత్సవాల్లో పాల్గొని బంజారా సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలకు తమ మద్దతు తెలిపిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా : ఆర్. భూపతిరెడ్డి , నగర మేయర్ ఉమారాణి , కార్పొరేటర్లు పంచరెడ్డి లలితాచరణ్ , గంగాధర్ , నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే వివిధ తాండాల నుంచి తరలివచ్చి తొమ్మిది రోజుల పాటు తీజ్ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన అక్కాచెల్లెళ్లు, యువతులు, యువకులు, సమాజ పెద్దలు, తాండా నాయకులు, కారోబారులు, పూజారులు మరియు తీజ్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలో తీజ్ పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు సహకరించిన నగర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు  ఇతర అధికార యంత్రాంగం, నాయకులు, తాండా పెద్దలు, యువతీ యువకులకు జిల్లా తీజ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తీజ్ పండుగ బంజారా సమాజానికి ఎంతో ప్రత్యేకమైన ఆచార, సంప్రదాయ పండుగ అని లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో ముఖ్యంగా పెళ్లికాని యువతులు తీజ్‌ను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ, తమ భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం బంజారా సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మరియు పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా తీజ్ కమిటీ పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో  తీజ్ కమిటీ సభ్యులు  చంద్రు నాయక్, మాజి కార్పొరేట్ చాంగు బాయి, రమేష్ రాథోడ్, గంగారాం, సర్పంచ్ డా.లాల్  సింగ్, నరేష్  తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్): బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
కార్మిక–రైతు పోరాటానికి డీవైఎఫ్ఐ  మద్దతు
రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు