- District News
- Nizamabad
- నిజామాబాదు నగరంలో విషాదం...
నిజామాబాదు నగరంలో విషాదం...
గోడ కూలి వ్యక్తి మృతి
Published On
By Ram Reddy
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 20:
పొట్టకూటి కోసం కూలీ పనుల కై వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్ నుంచి వచ్చిన అడ్డా కూలీ వెళ్లాడు. అయితే గోడను కూలగొట్టే క్రమంలో అకస్మాత్తుగా అది అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే సదరు కూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
