డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి వారం రోజుల జైలు. -

బంట్వారం ఎస్ఐ విమల.

Published On
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి వారం రోజుల జైలు. -

లోకల్ గైడ్/బంట్వారం
 మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించింది. ఆదివారం బంట్వారం పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో బంటు రమేష్‌ అనే వ్యక్తికి 494/100 మి.లీ. ఆల్కహాల్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతడిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి నాయి బ్రహ్మ నరసింహులు వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ విమల తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

Tags:

About The Author

Latest News