- District News
- Warangal
- ప్రతిభ చాటిన వాకర్స్ సభ్యులకు ఘన సన్మానం
ప్రతిభ చాటిన వాకర్స్ సభ్యులకు ఘన సన్మానం
నాగిశెట్టి ప్రసాద్
వాకర్స్అసోసియేషన్ అధ్యక్షులు...వెల్లడి
Published On
By Ram Reddy
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్
(లోకల్ గైడ్ న్యూస్)
వరంగల్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి, ఉన్నత పదవులకు ఎన్నికైన, ఉత్తమ సేవలకు గుర్తింపు పొందిన అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖానాపురం మండలం
పిఆర్ టియు మండల అధ్యక్షులుగా ఎన్నికైన అల్వాల భిక్షపతి, పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన పెండం భాస్కర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన మోతే ఇంద్రసేనారెడ్డి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జరుపుల భద్రు, మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన భూక్య రాజలింగం, పద్మశాలి సంఘం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన పెండం రాజులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ కేవలం ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, సభ్యుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఆత్మీయ కుటుంబంగా ముందుకు సాగుతోందని అన్నారు. అసోసియేషన్ సభ్యులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలు తమందరికీ గర్వకారణమని, ఒకరి విజయాన్ని మరొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సమాజంలో సానుకూల వాతావరణాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
మన సభ్యుల విజయాలు వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు...అవి మొత్తం వాకర్స్ అసోసియేషన్ కుటుంబానికి గర్వకారణం అన్నారు. ప్రతిభను గుర్తించడం, సేవలను గౌరవించడం, విజయాలను అభినందించడం మనందరి బాధ్యత” అని నాగిశెట్టి ప్రసాద్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాజుల సాంబయ్య, మోర్తాల రామ్రాజు, దూపటి కృష్ణమూర్తి, అబ్బరవొయిన వెంకన్న, కుతూరు వీరారెడ్డి, జూలపల్లి రాజేశ్వరరావు, గద్దే శ్రీనివాసరావు,బండి సుధాకర్,వంకాయల
పాటి భద్రి, వడిచర్ల సురేష్, కొలువుల శ్రీనివాసు తదితర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య ఆత్మీయత, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, సభ్యుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఇలాంటి అభినందన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 18:41:25
శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ):
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
