- District News
- మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు...
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
నేడు తాండూర్‌లో ప్రశంసాపత్రాలతో సన్మానం - మండల విద్యాధికారి నర్సింగ్‌రావు
లోకల్ గైడ్/తాండూర్:
విద్యార్థుల అభ్యున్నతికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు, పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేసిన 17 మంది ఉపాధ్యాయులను పెద్దేముల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి నర్సింగ్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ విధుల్లో ప్రతిభ కనబరుస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాలల పురోగతికి కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం తరఫున నేడు (శుక్రవారం)ఘనంగా సన్మానించనున్నారు.పెద్దేముల్ మండలానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఎస్. మంజుల (ఎస్ఎ-తెలుగు), పి. లింగమూర్తి (ఎస్ఎ-గణితం), సి. జయమ్మ (ఎస్ఎ-తెలుగు), అనిత (సిఆర్టి-హిందీ, కేజీబీవీ పెద్దేముల్), ఎం.కె. వెంకట కృష్ణారెడ్డి (పీజీటీ-జంతుశాస్త్రం, టిజిఎంఎస్ గొట్లపల్లి), కె. అన్నపూర్ణ ( పిఎస్హెచ్ఎం, ఎంపీపీఎస్ పెద్దేముల్), కె. స్నేహలత (ఎస్జిటి, ఎంపీపీఎస్ బండపల్లి), సయ్యద్ మహబూబ్ పటేల్ ఎంపీపీఎస్ తట్టేపల్లి), కావలి రవిందర్ ( ఎంపియుపిఎస్ గోపాల్‌పూర్), ఈ. బారాజ్ ( ఎంపీపీఎస్ హన్మాపూర్), జె. సౌజన్య (కందనెల్లి తాండా), ఎన్. అవంతి (ఎంపీపీఎస్ హన్మాపూర్), సిహెచ్. సుజాత (ఎస్జిటి గిర్మాపూర్), ఏ అనూష (ఎస్జిటి థింసాన్ పల్లి),తదితరులు ఉన్నారు.ఎంపికైన ఉపాధ్యాయులను నేడు(శుక్రవారం) సాయంత్రం 4:30 గంటలకు తాండూర్‌లోని తులసి గార్డెన్‌లో ప్రశంసాపత్రాలతో సన్మానించనున్నారు.కాగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి నర్సింగ్‌రావు తెలిపారు.
