- District News
- ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్
ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల, తాఠ్య తండాలలో
భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల మేరకు పారదర్శకమైన, బోగస్ ఓటర్లు లేని ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.
గురువారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల, తాఠ్య తండాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.
మొగిలిచర్ల పోలింగ్ బూత్ నెంబర్ 60,61, 62, లలో 310 మందికి, తాఠ్యతండా పోలింగ్ బూతు నెంబర్ 66 లో 287 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను పోర్టల్‌లో నమోదు (Digitalization) చేసే ప్రక్రియ పూర్తి చేసి, నమోదు చేసిన వివరాలను పాత ఓటరు డేటాతో సరిపోల్చి (Cross-Verification) కచ్చితత్వాన్ని ధ్రువీకరిస్తున్నారు.
కొత్త ఓటర్ల నమోదు (ఫారం-6): 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత నుంచి కొత్త ఓటు హక్కు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారని, ఓటరు వివరాల్లో తప్పుల సవరణ, నియోజకవర్గం మార్పు లేదా ఎపిక్ (EPIC) కార్డు మార్పుల కోసం ఫారం-8 దరఖాస్తులను పరిశీలించారు. అనర్హులు, మరణించిన వారు లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్ల తొలగింపుపై అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందని, ప్రజా సందేహాలు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రతి మండల/మున్సిపల్ పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులో ఉండాలని రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) భాగస్వామ్యంతో ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఓటర్లు తమ దరఖాస్తుల స్థితిని మరియు వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ voters.eci.gov.in లేదా Voter Helpline App ద్వారా సరిచూసుకోవచ్చని అన్నారు. SIR ప్రక్రియపై సందేహాలు లేదా ఫిర్యాదుల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చునని ముసాయిదా జాబితా లేదా నమోదుపై ఎలాంటి సందేహాలున్నా నిర్ణీత గడువులోగా ERO లేదా జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) కార్యాలయంలో అప్పీల్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసిల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
