- District News
- నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం.
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం.
రైతు సలహా నూతన కమిటీ ఎంపిక..
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 10:
వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఆదర్శ మని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను ఎమ్మెల్యే మేఘారెడ్డి స్మరించుకున్నారు. అన్యాయాన్ని, దొరల పెత్తనాన్ని ధైర్యంగా ఎదిరించి, పేదలు, బడుగు , బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మకు ఆయన హృదయ పూర్వక నివాళులు అర్పించారు.

---- రైతు సలహా నూతన కమిటీ ఎంపిక ....
ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తో30 మంది రైతు సలహ కమిటీకి గాను 10 మంది వనపర్తి చెందిన నాయకులకు స్థానం కల్పించారు. రైతుల సమస్యలు, సూచనలు, అవసరాలను నేరుగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏ టీ ఎంఏ ఆధ్వర్యంలో జిల్లా రైతుల సలహా కమిటీ ( డీ ఎఫ్ ఏసీ) ఏర్పాటు చేశారు.ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చైర్మన్‌గా ఉంటారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ మాజీ సర్పంచ్ విట్ట సూర్యచంద్రారెడ్డి రైతు కమిటీకి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రైతు సలహ కమిటీ
సభ్యులుగా పెద్ద మందడి ఇటిక్యాల ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఘనపురం కార్పునొల్ల ప్రభాకర్ రెడ్డి, ఖిలఘనపురం రాగనమోని మల్లేష్ , వనపర్తి
కొతకాపు చంద్రశేఖర్ రెడ్డి , కొత్తసమర సింహారెడ్డి , పెబ్బేరు పుల్లూరు నీలవ్ రెడ్డి , గోపాల్ పేట
వడ్డెమాన్ నాగన్న, గంట వెంకట్ రెడ్డి , ఏదుల
కటమోని రమేష్ లను కమిటీ సభ్యులుగా నియమించారు. రైతుల సమస్యలు, పంటల సాగు, మార్కెటింగ్, వ్యవసాయ పథకాలు తదితర అంశాలపై రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
----- స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని చిన్న జీయర్ స్వామిని కోరిన ఆలయ ధర్మ కర్త, ఎమ్మెల్యే ...
వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి అర్ధ శతాబ్దపు ఆధ్యాత్మిక స్వర్ణోత్సవ వైభవ వేడుకలకు చిన్న జీయర్ స్వామి రావాలని ఆలయ ధర్మకర్త రఘునాథచార్యులు, శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కోరారు. వచ్చే ఏడాది మార్చి 10, 11, 12 తేదీల్లో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహోత్సవాలకు చిన్న జీయర్ స్వామివారు హాజరుకానున్నారుని వారు చెప్పారు. అందుకు జీయర్ స్వామి సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. 5 దశాబ్దాల ఆలయ ఆధ్యాత్మిక ప్రస్థానానికి గుర్తుగా జరిగే స్వర్ణోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తోంది. జీయర్ స్వమి
ఆహ్వానానికి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా సతీమణి శారదా రెడ్డి, కుమారుడు నవనీత్ రెడ్డి లతో వెళ్లి కలిశారు. వారితోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఎస్ ఎల్ ఎన్ రమేష్, తిరుమల మహేష్, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
