వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!

Published On
వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!

 లోకల్ గైడ్  సెప్టెంబర్ 10  మహబూబాబాద్ 


వాహనం అమ్మిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయించుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు

మహబూబాబాద్ జిల్లా వాహన యజమానులు తమ వాహనాలను ఇతరులకు విక్రయించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ సూచించారు. వాహనం విక్రయించిన తర్వాత కేవలం తెల్లకాగితంపై అగ్రిమెంట్ చేసుకోవడం మాత్రమే కాకుండా, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో యాజమాన్య బదిలీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని తెలిపారు.
ఇటీవల (గౌతమ్) పేరు మార్చాము అనే వ్యక్తి ఆటోను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి, కొంతకాలం తర్వాత ఈఎంఐలు చెల్లించలేక మరో వ్యక్తికి విక్రయించాడు. అయితే వాహనం విక్రయించే సమయంలో కేవలం తెల్లకాగితంపై అగ్రిమెంట్ చేసుకున్నారు. వాహనం ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం గౌతమ్ పేరుమీదే కొనసాగింది.
తర్వాత ఆ ఆటోలో గంజాయి తరలిస్తుండగా భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీఏ రికార్డుల ప్రకారం వాహనం యజమాని గౌతమ్ పేరుమీద ఉండటంతో ఆయన పోలీసు కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు వాహనం ఫైనాన్స్‌లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న ఈఎంఐలు చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ నుంచి కూడా ఒత్తిడి ఎదురైంది.

ఈ ఘటన వాహనం విక్రయించే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక వంటిదని శంకర్ నాయక్ పేర్కొన్నారు. వాహనం అమ్మిన తర్వాత కొనుగోలుదారుడి పేరుమీద యాజమాన్య బదిలీ జరిగిందా లేదా అనే విషయాన్ని విక్రయించిన వ్యక్తి స్వయంగా నిర్ధారించుకోవాలని సూచించారు.

వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి ప్రమాదానికి గురిచేసినా, నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించినా లేదా ఇతర చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నా, ఆర్టీఏ రికార్డుల్లో వాహనం పాత యజమాని పేరుమీదే ఉంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
వాహన యజమానులకు విజ్ఞప్తి
వాహనాన్ని ఎవరికైనా విక్రయించినప్పుడు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడం లేదా డబ్బు తీసుకోవడంతో బాధ్యత పూర్తయిందని భావించకుండా, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో యాజమాన్య బదిలీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలి. రికార్డుల్లో కొత్త యజమాని పేరు నమోదైనట్లు నిర్ధారించుకున్న తర్వాతే విక్రయ ప్రక్రియ పూర్తయిందని భావించాలని శంకర్ నాయక్ సూచించారు.మహబూబాబాద్ జిల్లా, రవాణా శాఖ కార్యాలయం తెలిపారు

Tags:

About The Author

Latest News

41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్  41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ 
      లోకల్ గైడ్ సెప్టెంబర్ 10  కురవి  మహబూబాబాద్ జిల్లా కురవి మండలం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు
రైతు కూలీల ఐక్య పోరాటానికి ఖమ్మం పిలుపు
చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: సర్పంచ్ బొప్పిడి గోపాల్
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు మేలు
చిట్యాల(చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!
తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.