- District News
- తోబుట్టువులు లేని లోటును తీర్చిన వందలాది మంది ఆడబిడ్డల ఆత్మీయ అనుబంధం రాఖీ బంధం.
తోబుట్టువులు లేని లోటును తీర్చిన వందలాది మంది ఆడబిడ్డల ఆత్మీయ అనుబంధం రాఖీ బంధం.
మనసులు గెలిచిన నాయకుడు సమ్మయ్య గౌడ్ ...
నిస్వార్ధ సేవకు అర్ధం చెప్పిన రాఖీ బంధం..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్
కేసముద్రం, ఆగస్టు 28
రాజకీయాలు, అధికారం, పదవులు... ఇవన్నీ తాత్కాలికం. కానీ మనుషుల నడుమ ఉండే ఆప్యాయత, పవిత్రమైన అనుబంధాలే శాశ్వతమని కేసముద్రం మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు, సమ్మయ్య గౌడ్ సమ్మి ఫౌండేషన్ అధినేత కేసముద్రం సమ్మయ్య గౌడ్ మరోసారి నిరూపించారు. దేవుడు సొంత రక్తసంబంధమైన అక్క చెల్లెళ్లను ఇవ్వలేదనే చిన్న వెలితి ఆయనలో ఉన్నా... ఊరంతా తన కుటుంబమే అనుకుని, దారిలో ఎదురయ్యే ఏ మహిళనైనా 'అక్కా బాగున్నావా.. చెల్లీ బాగున్నావా' అంటూ కంటికి రెప్పలా ఆప్యాయంగా పలకరించే ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి, ఈ ఊరి ఆడపడుచులు అరుదైన నీరాజనం అర్పించారు.
రాఖీ పౌర్ణమి వేడుకలకు రెండు రోజుల ముందే సమ్మయ్య గౌడ్ నివాసం ఒక ఆత్మీయ సాగరాన్ని తలపించింది. తమను సొంత అక్కచెల్లెళ్లలా భావించి ఆదరించే నాయకుడికి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకోవడానికి ఏకంగా వందలాది మంది ఆడబిడ్డలు ఒక్కసారిగా ఆయన గృహానికి తరలివచ్చారు. దారిన పోయే పరిచయాన్ని కూడా పవిత్రమైన బంధంగా మలచుకున్న ఒక నాయకుడి ఇంటి ముందర, వందలాది మంది మహిళలు వరుసకట్టి నిల్చున్న ఆ దృశ్యం కేసముద్రం చరిత్రలోనే" న భూతో న భవిష్యత్ "ఘట్టంగా నిలిచిపోయింది.
తనపై చూపించిన ఈ అపారమైన ప్రేమను చూసి సమ్మయ్య గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరా ఇద్దరా... వందల మంది ఆడపడుచులు వచ్చి చేతికి రాఖీలు కడుతుంటే, ఆ పవిత్రమైన బంధానికి ఆయన కళ్ల వెంట ఆనంద భాష్పాలు వరదలా పారాయి. తన ఆనందాన్ని తట్టుకోలేక, రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు సమ్మయ్య గౌడ్ కన్నీళ్లతో పాదాభివందనం చేశారు. ఒక ప్రజాప్రతినిధి, సమాజంలో ఎంతో పేరున్న వ్యక్తి అయి ఉండి కూడా, వినయంతో ఒదిగిపోయి ప్రతీ అక్కాచెల్లి పాదాలను తాకి నమస్కరిస్తుంటే అక్కడున్న ఆడపడుచుల గుండెలు ద్రవించిపోయాయి..సొంత అక్కచెల్లెళ్లు లేరనే బాధ నా జీవితంలో ఎప్పుడూ ఉండేది. కానీ ఈ రోజు నా కళ్లముందు ఉన్న ఇన్ని వందలమంది మంది ఆడబిడ్డలను చూస్తుంటే ఆ భగవంతుడు నాకు లోకంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇచ్చాడనిపిస్తోంది. మీరు నాపై చూపించిన ఈ ప్రేమానురాగాలకు నేను జన్మజన్మలకీ రుణపడి ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా ఏ కష్టం వచ్చినా ప్రతీ ఆడబిడ్డకు ముందువరుసలో అండగా నిలబడతాను. సమ్మి గౌడ్ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతకు, పేద అక్కచెల్లెళ్ల విద్య, ఆరోగ్య రక్షణకు నా శ్వాస ఉన్నంత వరకు కృషి చేస్తాను అని చేమర్చిన కళ్ళతో రక్షాబంధన్ కట్టిన ఆడబిడ్డలకు మాటిచ్చారు కాంగ్రెస్ నూతన అధ్యక్షులు సమ్మిగౌడ్ చిలువేరు .."
అధికార బలం, ధన బలంతో మనుషులను సంపాదించుకోవడం చాలా సులభం. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా వందలాది మంది ఆడపడుచుల ఆశీస్సులు పొంది, వారి గుండెల్లో అన్నగా స్థానం సంపాదించుకోవడం కేవలం సమ్మయ్య గౌడ్ లాంటి మచ్చలేని వ్యక్తిత్వానికే సాధ్యమని స్థానికులు కొనియాడారు. ఈ రక్షాబంధన్ మండలం లో,మానుకోట జిల్లాలో మరొక్కమారు అన్నచెల్లెల బంధానికి అద్దం పట్టిందని స్థానికులు కొనియాడారు....
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 18:14:29
రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
