- District News
- _టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
_టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
_సీఎండీ జితేష్ వి. పాటిల్‌కు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు
కుత్బుల్లాపూర్ ఆగస్టు 28 (లోకల్ గైడ్ ప్రతినిధి)
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్‌కు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. ఎం. తులసి నాగవాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, జాయింట్ సెక్రటరీ అరవింద, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుజాతతో పాటు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ఉద్యోగులకు సీఎండీ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధిలో మహిళా ఉద్యోగులు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సంస్థకు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
అనంతరం మహిళా ఉద్యోగులు సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సోదరభావం, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి.
