పాలమాకులలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

 వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలి - షాద్ గర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.శంకరయ్య. 

Published On
పాలమాకులలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం



 శంషాబాద్, ( లోకల్ గైడ్ ):                                   వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని షాద్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి శంకరయ్య సూచించారు. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శ్రీ శివం ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పాలమాకుల గ్రామంలోని P1 రోడ్డులో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. 

ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు 35 హెల్మెట్లను పంపిణీ చేసి, హెల్మెట్ ధరించడాన్ని ప్రోత్సహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతకు కూడా బాధ్యత వహించాలని సూచించారు.

Tags:

About The Author

Latest News