- District News
- Ranga Reddy
- గగన్ పహాడ్ లో రూ. 50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. ...
గగన్ పహాడ్ లో రూ. 50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం.
గురవుతున్న ప్రభుత్వ భూమి ని కాపాడండి
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా దారులు కబ్జాకు యత్నిస్తున్నారని, ఈ కబ్జా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోని ప్రభుత్వ భూమిని కాపాడాలని గగన్ పహాడ్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం గగన్ పహాడ్ కు చెందిన తలారీ శ్రీరాములు, ఈశ్వరయ్య,రత్నం తదితరులు శుక్రవారం రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సురేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ భూమి కబ్జాకు గురవుతుంటే స్థానికులం అందరం కలిసి ఏడాది ఏప్రిల్ నెలలో రాజేంద్ర నగర్ తహసీల్దార్, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ లకు వినతి పత్రాలు అందజేయటంతో కబ్జా కు పులిస్టాప్ పడిందని గుర్తు చేశారు. ఈ భూమి ప్రజల సౌకర్యర్థం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేయటం తో పాటు రక్షణ కోసం ప్రహరీని నిర్మించాలని కోరటం జరిగిందన్నారు. అయితే ఈ భూమికి ప్రహరీని నిర్మించకపోవడంతో ప్రస్తుతం కొందరు కబ్జాదారులు మళ్ళీ ఎంతో ( కోట్ల ) విలువైన ఈ భూమిని కబ్జా చేసేందుకు పనులు చేపట్టారని తెలిపారు. ఈ భూమిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించండి... గగన్ పహాడ్ లోని సర్వే నెంబర్ 295 లో 26 గుంటల ప్రభుత్వ భూమిని 1986 లో ప్రజా అవసరాల కోసం రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం లో డాక్యుమెంట్ నెంబర్ 3471/ 1986 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింద తెలిపారు. ఈ ప్రాంతం ఊహించని రీతిలో ప్రెస్టేజ్ సిటీ, హైకోర్టు, శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు జాతీయ రహదారి కిరువైపులా భారీ టవర్స్ రావడంతో ఈ ప్రాంతం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు భూ కబ్జాదారులు సుమారు 50 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందుకోసం అధికారులు వెంటనే ఎంతో విలువైన ఈ ప్రభుత్వ భూమిని స్థానిక ప్రజల సౌకర్యార్థం అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. గతంలో ప్రభుత్వ భూమి అని ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు. తక్షణమే ఈ భూమికి ప్రహరీని నిర్మించడంతోపాటు అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తలారి శ్రీరాములు, తలారి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.
