- District News
- Ranga Reddy
- మూడు దశాబ్దాల విద్యా సేవకు దక్కిన గౌరవం
మూడు దశాబ్దాల విద్యా సేవకు దక్కిన గౌరవం
శ్రీరామ్‌ను వరించిన నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 11:
విద్యా రంగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆమనగల్లు
'సెయింట్ జాన్స్ 'స్కూల్
కరస్పాండెంట్, సీనియర్ ఉపాధ్యాయుడు అభిమల్ల శ్రీరామ్‌కు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో శ్రీరామ్‌ను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థులను కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా జీవిత విలువల్లోనూ తీర్చిదిద్దేందుకు శ్రీరామ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మూడు దశాబ్దాల విద్యా సేవకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కడం ఆయన సేవలకు లభించిన సముచిత గౌరవమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆమనగల్లు ఎంఈఓ పాండు మరియు డివిజన్ ట్రస్మా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొని శ్రీరామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందిస్తూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
