కాంగ్రెస్‌ పాలనపై బీఆర్ఎస్‌ భగ్గుమన్నది.. ప్రజావాణిలో వినతిపత్రం

ప్రజావాణిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్‌ వినతిపత్రం

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ ఘాటు విమర్శలు
Published On
కాంగ్రెస్‌ పాలనపై బీఆర్ఎస్‌ భగ్గుమన్నది.. ప్రజావాణిలో వినతిపత్రం

న్యూస్ స్టార్ట్ 






లోకల్ గైడ్
ఆమనగల్లు, సెప్టెంబర్‌ 7: 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పిలుపు మేరకు సోమవారంIMG-20260907-WA0126 రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్‌, ఫ్లోర్‌ లీడర్‌ ఎనమళ్ళ రమేష్‌ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్‌ అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎంపీడీఓకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యుడు, కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ గుర్క జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఆడబిడ్డలకు తులం బంగారం, స్కూటీలు, రైతులకు రైతుబంధు–రైతుభరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్‌, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్‌ వంటి హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన జైపాల్‌ యాదవ్‌, రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాంనుంతల సర్పంచ్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనునాయక్‌, కౌన్సిలర్లు నాగిళ్ళ జగన్‌, దుడ్డు ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు సయ్యద్‌ ఖలీల్‌, ఎంగళి రఘు, సైదులు గౌడ్‌, చుక్క నిరంజన్‌, కమటం వెంకటయ్య, వస్పుల సాయిలు, లండం యాదయ్య, రమేష్‌ నాయక్‌, డేరంగుల వెంకటేష్‌, కొమ్ము ప్రసాద్‌, రాముల మహేష్‌, మహేష్‌ నేత, పుల్లారెడ్డి శ్రీశైలం, మాలేపల్లి పరమేష్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి