- District News
- కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో...
కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో...
అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ అవగాహన సదస్సు..
వాజేడు మండలం మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రగలపల్లి గ్రామంలో అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ పైన అవగాహన సదస్సు ను బుదవారం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు శాఖ గొంది నారాయణ , ఎఫ్. ఈ ఓ మాట్లాడుతూ అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలు గ్రామీణ, గిరిజన సమాజాల జీవన విధానంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయని అన్నారు. తరతరాలుగా ప్రజలు అడవిలో లభించే వివిధ ఆకులు, కాయలు, పండ్లు, వేర్లు, గింజలు మరియు ఇతర సహజ వనరులను ఆహారంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా, స్థానికంగా లభించే ఔషధ మొక్కల ఉపయోగం, వాటి గుర్తింపు, సేకరణ మరియు సంప్రదాయ వినియోగంపై విలువైన జ్ఞానం సమాజంలో ఉందని అన్నారు. ఈ అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం స్థానిక ప్రజల్లో ఉన్న అడవి ఆహారాలు మరియు ఔషధ మూలికలకు సంబంధించిన సాంప్రదాయ జ్ఞానాన్ని సేకరించి, పద్ధతిగా నమోదు చేయడం, మరియు ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థానిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటం ఈ డాక్యుమెంటేషన్ యొక్క ముఖ్య లక్ష్యంఅనితెలిపారు. ఈ కార్యక్రమానికి. మురుమూరు గ్రామపంచాయతీ.సర్పంచ్ మడకం సుభద్ర,ఉప సర్పంచ్, వాజేడు మండల కోఆర్డినేటర్ జి. కామేష్, యానిమేటర్స, పి స్వరూప, సిహెచ్ రమాదేవి, సిహెచ్ భాస్కరు, దీపిక,ప్రసాదు,గ్రామస్థులు పాల్గొన్నారు.
