అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ కుట్రలు: డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి

పెట్టుబడిదారులను బెదిరించడం సరికాదు

Published On
అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ కుట్రలు: డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 11( లోకల్ గైడ్):

ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో దక్షిణ తెలంగాణ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, దీన్ని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, దీనివల్ల ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాంటి పెట్టుబడులను అడ్డుకునేలా కేటీఆర్ బెదిరింపు ధోరణితో వ్యవహరించడం అభివృద్ధికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించినా ఆ పార్టీ నేతల అహంకార ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఉండదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కాలుష్యకారక, విషపూరిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ సిటీ వంటి ఆధునిక అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, సేవా రంగాలు విస్తరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్ ఆశలు పగటి కలలేనని ఎద్దేవా చేశారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కాలుష్య పరిశ్రమల విషయంలో బీఆర్ఎస్ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రగతికి ఆటంకంగా మారుతున్న బీఆర్ఎస్ రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.