ఎస్ ఐ ఆర్ -2026 నోటీసుల ప్రక్షాళన, పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి. 

రాజేంద్ర నగర్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సార్ ప్రక్రియ ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్. రెడ్డి

Published On
ఎస్ ఐ ఆర్ -2026 నోటీసుల ప్రక్షాళన, పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి. 


                                                                                               .      IMG-20260902-WA0114          ఎస్ ఐ ఆర్ నోటీసుల ప్రక్షాళన, పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ, హైదర్ షాకోట్, శివరాంపల్లి ప్రాంతాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి నారాయణ రెడ్డి  స్థానిక అధికారులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. నోటీసుల హియరింగ్ ప్రక్రియలో  ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా...? ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారా అని ఆయన పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్‌షాకోట్, శివరాంపల్లి ప్రాంతాల్లో స్వయంగా పరిశీలిస్తూ ఏమైనా సమస్యలు తన దృష్టికి తేవాలన్నారు. 
         రంగారెడ్డి జిల్లాలో ఎస్ ఐ ఆర్ హియరింగ్ ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఈ సందర్భంగా సీ‌ఈ‌ఓ ఆదేశించారు. జిల్లాలో నో మ్యాపింగ్ కేటగిరీలకు సంబంధించిన రికార్డులు, దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.  హియరింగ్‌కు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన ఆధారాలను ధృవీకరించిన అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించి, రోజువారీ లక్ష్యాలు, ప్రామాణిక విధానాలు, సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పనులను కొనసాగించాలని సూచించారు. సంబంధిత పత్రాల సమర్పణ, క్షేత్రస్థాయి సహాయం, రికార్డుల పరిశీలన మరియు ధృవీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శేరిలింగంపల్లి జోన్‌లో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు. హియరింగ్ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించి, ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.