రాజోలు గ్రామంలో నూతన శివాలయానికి శంకుస్థాపన.

ఎమ్మెల్యే రామచంద్రనాయక్

Published On
రాజోలు గ్రామంలో నూతన శివాలయానికి శంకుస్థాపన.

 

 లోకల్ గైడ్ 
కురవి, ఆగస్టు 31:   

కురవి మండలం రాజోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శివాలయానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్  సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శుభారంభం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్  మాట్లాడుతూ.. రాజోలు గ్రామంలో నూతన శివాలయ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. శివాలయం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని, ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్ ,కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్, జిల్లా కోశాధికారి గార్లపాటి వెంకట్ రెడ్డి, రాజోలు సర్పంచ్ బానోత్ మంగమ్మ–దేవేందర్, ఉప సర్పంచ్ కొక్కు శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండెల సంజీవ రెడ్డి,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గోప నాయక్, దిశ కమిటీ సభ్యుడు మలోత్ రాజ్ పుత్, పొలంపల్లి గ్రామ సర్పంచ్ బానోత్ లాల్సింగ్, మండల, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్ సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : మండలంలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల యూనిఫాంలు,
భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
"కోట్ల మణిపూసలు"
మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి
"శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల సమన్వయం - శాంతి భద్రతల పరిరక్షణ
సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...