- District News
- Ranga Reddy
- హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వ...
హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ . రంగారెడ్డి
హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ . రంగారెడ్డి
హెచ్ ఐ వీ సోకినవారి పట్ల వివక్షత చూపరాదని, ప్రేమతో స్నేహ పూర్వకంగా మెలగాలని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ అన్నారు. మంగళవారం హెచ్ ఐ వీ, ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ బైక్ ర్యాలీని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ స్వర్ణ కుమారి జెండా ఊపి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారిణి డాక్టర్ పాప రావు, డి టి ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెంటర్స్ ఆరోగ్య శాఖ సిబ్బంది, యువత, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీలో హెచ్ ఐ వీ, ఎయిడ్స్ నివారణ, సురక్షిత జీవన విధానం, పరీక్షలు, చికిత్స, వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం వంటి అంశాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. బైక్‌లపై అవగాహన పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ హెచ్ ఐ వీ, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. హెచ్ ఐ వీ తో జీవిస్తున్న వారిని వివక్షకు గురిచేయకుండా వారికి గౌరవం, అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
హెచ్ ఐ వీ, ఎయిడ్స్ కు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం 1097 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ణి వినియోగించుకోవాలని సూచించారు.
