ఇందిరా నగర్ బస్తీ కరెంట్ సమస్యలు పరిష్కరించాలని

అధికారులుకు బస్తీ వాసులు వినతి 

Published On
ఇందిరా నగర్ బస్తీ కరెంట్ సమస్యలు పరిష్కరించాలని

గండిపేట, ఆగస్టు 18 (లోకల్ గైడ్ ):

రాజేంద్రనగర్ సర్కిల్ 123 డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ బస్తీ లో ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బస్తీ వాసులు విద్యుత్  శాఖ ఎస్ ఈ వినతి పత్రాన్ని అందించారు. మంగళవారం బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు హరీష్ గౌడ్ మాట్లాడుతూ.... ఇందిరా నగర్ బస్తీ లో దాదాపు 400 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, వారికి సరైన విద్యుత్ సరఫరా సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని ఏ ఈ రమేష్ దృష్టి కి తీసుకెళ్లారని పేర్కొన్నారు. బస్తివాసుల సమస్యల తీవ్రత ను గుర్తించిన ఎస్ ఈ , విద్యుత్ సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే బతికి మెరుగైన సరఫరా అందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...