- District News
- Ranga Reddy
- ఆమనగల్లు లో నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నిర్మాణానికి సన్నాహాలు
ఆమనగల్లు లో నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నిర్మాణానికి సన్నాహాలు
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 19:
ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర, జాతీయ కమిటీలు ఇటీవల రద్దు కావడంతో, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నూతన మండల కమిటీల నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
ఇందులో భాగంగా ఆగస్టు 20న మధ్యాహ్నం 12 గంటలకు ఆమనగల్లు పట్టణంలోని షాద్‌నగర్ రోడ్డులో గల లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మార్పీఎస్ నూతన ఆమనగల్లు మండల కమిటీతో పాటు ఎంఎస్పీ, ఎంఎస్‌ఎఫ్, ఎంఎంఎస్ తదితర అనుబంధ సంఘాల నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మండల పరిధిలోని అన్ని గ్రామాల కమిటీలు, ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు, మాదిగ కుల పెద్దలు, విద్యార్థులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటూ జాతి శ్రేయస్సు కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలుస్తున్న నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి తుడుం కిరణ్ మాదిగ, సీనియర్ నాయకుడు మల్లెపోగు మల్లేష్ మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు కావలి శ్రీశైలం మాదిగ, నాయకులు పులికంటి మైసయ్య మాదిగ, అల్లాజీ మాదిగ, జానయ్య మాదిగ, శ్రీరామ్ మాదిగ, రమేష్ మాదిగ, శ్రీశైలం మాదిగ తదితరులు పాల్గొన్నారు.
“జై మాదిగ.. జై మందకృష్ణ మాదిగ” అనే నినాదంతో సామాజిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
