శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

Published On
శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

 

 

శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ):

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. గురువారం  రూ.1 కోటి 55 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు చేవెళ్ల శాసనసభ్యులు  కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 
మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 
 2వ వార్డు: రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన.
6వ వార్డు: రూ.66 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన.
 పాత పోలీస్ స్టేషన్ పక్కన: రూ.19 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News