మణికొండలో ఘనంగా మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

మట్టి విగ్రహాలను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడదాం” : వాసిరెడ్డి నరేష్

Published On
మణికొండలో ఘనంగా మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

గండిపేట, సెప్టెంబర్ 12 లోకల్ గైడ్ :

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మణికొండ డివిజన్‌లో  మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ పరిధిలోని తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, భాగ్యలక్ష్మి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, శివపురి కాలనీ అసోసియేషన్, మహాత్మా గాంధీ పార్క్–అల్కాపురి కాలనీలో కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ రాష్ట్ర సమన్వయకర్త వాసిరెడ్డి నరేష్, ప్రజా సేవా సమితి, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు, స్థానిక నివాసితుల సహకారంతో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్ మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామరాజు సీతారాం దాస్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు రామ్ మోహన్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పీ.ఎస్.ఎన్. మూర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్రజా సేవా సమితి సభ్యులు రాజేష్ రెడ్డి, శివ శంకరరావు, సుభాష్, సీతారామరాజు, ఈశ్వర్, ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు కుమ్మరి సత్యనారాయణ, ఎంప్లాయిస్ కాలనీ అధ్యక్షుడు కుమ్మరి రమేష్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.ఎస్. ఆచార్యులు, సలహాదారుడు అజ్మతుల్లా, కోశాధికారి ప్రేమ్ కుమార్, వసంత, కొండూరి కిషోర్, జట్ల వంశీ, గుత్తా రోహన్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు రామానుజం, బుజ్జయ్య, రమణయ్య, వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.